
పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆయన నివాసంలో వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మానాయుడు పిన్నెల్లిని కలిసి ఆయన ఆరోగ్యం, పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
