
నెల్లూరు సెంట్రల్ జైలు నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. సుమారు 98 రోజుల అనంతరం ఆయన జైలు నుంచి బయటకు రావడంతో వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
పిన్నెల్లి విడుదల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాచర్ల మండలం రాయవరం జంక్షన్‌కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేరుకోనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. అక్కడ ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
