
పల్నాడు జిల్లా, మాచర్ల:
ఉగాది పండుగ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పులకించే ఈ వసంత కాలంలో, కొత్త చిగురులు తొడిగే ఈ శుభ వేళలో ప్రతి కుటుంబంలో సరికొత్త వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
“పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు తీసుకురావాలి” అని ఆయన పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలను సూచిస్తాయని, వాటిని సమానంగా స్వీకరించే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని సమతుల్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే నిజమైన విజయాన్ని అందుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
