
🚨 బ్రేకింగ్ న్యూస్ | పల్నాడు జిల్లా – మాచర్ల
మాచర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడమ్మ, జమ్మలమడక గ్రామానికి చెందిన గంగెనబోయిన నాగరాజుతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
పెద్దలు అంగీకరించరనే భయంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో, చౌడమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ, వారం రోజుల క్రితం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగారు.
అక్కడికి చేరుకున్న డీఎస్పీ, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అమ్మాయిని తీసుకువస్తామని హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాలుగు రోజుల క్రితం పోలీసులు చౌడమ్మను స్టేషన్‌కు తీసుకువచ్చి, పెద్దల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రేమించిన వ్యక్తి దూరమవడంతో మనస్తాపానికి గురైన చౌడమ్మ, ఈరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన మాచర్లలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
