
గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు.
ఈ కేసులో ఆయన A6గా ఉన్నారు.
దాదాపు 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
👉 ఇదే కేసులో:
ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (A7) ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే వెంకటరామిరెడ్డికి బెయిల్ మంజూరు కాలేదు.
📌 విడుదలపై ఉత్కంఠ:
ఈరోజు కోర్టు సమయం ముగియడంతో వెంటనే విడుదలపై అనిశ్చితి నెలకొంది.
రేపు, ఎల్లుండి కోర్టు సెలవులు ఉండటంతో మరో రెండు రోజులు జైలులోనే ఉండే అవకాశం ఉంది.
ఈ నెల 21న నెల్లూరు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
🎉 బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి.
