
మాచర్ల నియోజకవర్గం:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం తెలుగు యువత అధికార ప్రతినిధి చల్లా రాజారత్నం మాట్లాడుతూ
“దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దివ్యాంగ శక్తి’ పథకం ఎంతో ప్రయోజనకరమైనది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దివ్యాంగులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలు, వైద్య సేవలు, విద్య వంటి అవసరాల కోసం వెళ్లేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారని, దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
