ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్‌తో మంటలు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని 133 కేవీ సబ్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ వాటర్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ… 132 కేవీ మాచర్ల–రెంటచింతల సర్కిట్-1 కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. సిబ్బంది తక్షణమే స్పందించి…
Author: myapnews9@gmail.com
మార్చి 02 అమరావతి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశలవారీగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6,593, ఎస్పీడీసీఎల్ పరిధిలో 11,926, ఈపిడీసీఎల్ పరిధిలో 27,594 కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కనెక్షన్ల మంజూరుతో రైతులకు సాగునీటి భద్రత లభించి, పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో అనేక కారణాల…
మార్చి 02 నరసరావుపేట : సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి 163అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అన్నీవిధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు జీతాలు పెంచి, ఆర్ధిక భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో 56 వేల మొబైల్ ఫోన్ల పంపిణీ చేసి, పని భారాన్ని తగ్గించమన్నారు. అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేస్తున్న 10 డిమాండ్లలో ఇప్పటికే తొమ్మిది కోర్కెలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుందని తెలిపారు. గతంలో 40 రోజులు ధర్నా చేసినా, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చంద్రబాబు నాయకత్వంలో అంగన్‌వాడీల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. అంతేకాక అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, త్వరలో సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
