
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అన్నీవిధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు జీతాలు పెంచి, ఆర్ధిక భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో 56 వేల మొబైల్ ఫోన్ల పంపిణీ చేసి, పని భారాన్ని తగ్గించమన్నారు. అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేస్తున్న 10 డిమాండ్లలో ఇప్పటికే తొమ్మిది కోర్కెలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుందని తెలిపారు. గతంలో 40 రోజులు ధర్నా చేసినా, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చంద్రబాబు నాయకత్వంలో అంగన్‌వాడీల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. అంతేకాక అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, త్వరలో సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

