నేరాల నియంత్రణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సెర్చ్ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో వివాదాలకు తావు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని సూచించారు. గ్రామాల్లో నేరాలను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.అలాగే గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం కారంపూడి సర్కిల్ సీఐ శరత్, ఎస్సై వాసు పర్యవేక్షణలో 42 మంది సిబ్బందితో నిర్వహించినట్లు తెలిపారు.
Author: myapnews9@gmail.com
గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగాస్వామివారికి నూతన పల్లకి బహుకరణమాచర్ల మండలం గన్నవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన పున్నయ్య కుమారులు స్వామివారికి నూతన పల్లకిని భక్తి భావంతో బహుకరించారు.అనంతరం దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి పారవశ్యం కనిపించింది.
రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కులవృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది.పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలుచోట్ల వడ్డెర సామాజికవర్గానికి చెందిన ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. తమ సంప్రదాయ వృత్తి అయిన రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకునేందుకు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం, తాజా కేబినెట్ సమావేశంలో ఈ…
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ఏడీఈ వీరేశ్వరరావు, ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, అలాగే శ్రీరామనవమి పండుగ, చివరి ఆదివారం వంటి సెలవులు ఉండటంతో కార్యాలయాలు మూసివుండే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే కార్యాలయానికి వచ్చి విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించారు.
మాచర్ల: యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం, వడ్డెర సమాజానికి మైనింగ్ రంగంలో 15% రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ, వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. దీంతో మాచర్ల పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు.పెట్రోల్ కోసం వాహనాలతో పాటు బాటిళ్లు, క్యాన్లు తీసుకుని బంకుల వద్దకు చేరుకున్న ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ఈ పరిస్థితిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ భాషా ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములను పరిశీలించారు.ఈ సందర్భంగా డీలర్లకు పలు సూచనలు చేశారు: పెట్రోల్ పంపిణీ క్రమబద్ధంగా నిర్వహించాలిఅనవసర నిల్వలను నియంత్రించే చర్యలు తీసుకోవాలిగ్యాస్ వినియోగదారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలిగ్యాస్ బుకింగ్ తేదీలను నోటీస్ బోర్డుల ద్వారా స్పష్టంగా తెలియజేయాలిప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు సమాచారం అందించాలిఅధికారులు ప్రజలను ఆందోళన చెందవద్దని,…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న బస్సు వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో రెండు వాహనాల్లోనూ క్షణాల్లోనే మంటలు చెలరేగాయి.🔥 క్షణాల్లోనే మంటలు… బయటకు రాలేని ప్రయాణికులుప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా, కొందరు కిటికీలు పగులగొట్టుకుని బయటపడగలిగారు.అయితే, లోపల చిక్కుకుపోయిన 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మంటల తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.🚑 గాయపడిన వారి పరిస్థితి విషమంఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో…
మాచర్ల (పల్నాడు జిల్లా): అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. పెట్రోల్ కోసం వాహనాలతో పాటు బాటిళ్లు, క్యాన్లు తీసుకుని బంకుల వద్దకు చేరుకున్న ప్రజలు, అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. దీంతో బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.డీజిల్ కొరత వస్తుందన్న భయంతో ఆటో డ్రైవర్లు కూడా పెద్ద మొత్తంలో డీజిల్ నింపుకుంటున్నారు. కొందరు ఆటోలతో పాటు పెద్ద డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో, కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో తాత్కాలికంగా మూతపడిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది.అధికారులు మాత్రం ఇంధన కొరతపై అధికారిక సమాచారం లేదని, అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
దాచేపల్లి:దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ బుధవారం బకాయిలపై నోటీసులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులు సూచించారు.వివరాల ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి:గవర్నమెంట్ హాస్పిటల్ – ₹3,36,600ఎమ్మార్వో కార్యాలయం – ₹6,48,323ప్రభుత్వ పాఠశాలలు – ₹9,28,322ఎంఢీఓ & ఈపీఆర్‌డీ కార్యాలయాలు – ₹8,15,220పోలీస్ స్టేషన్ – ₹1,36,313ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ, మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా, వినుకొండ: వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే పట్టణ శివారు కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా మారుతోంది. అధికారులు రోజు మార్చి రోజు కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.పైపులైన్లు లేని ప్రాంతాల్లో పురపాలక సంఘం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. అయితే జనాభా అధికంగా ఉండటంతో ఆ నీరు సరిపోవడం లేదు. ముఖ్యంగా మసీదు మాన్యం (అజాద్‌నగర్) ప్రాంతంలో సుమారు 2 వేలకుపైగా పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ పైపులైన్ సదుపాయం లేకపోవడంతో పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కాలనీ వాసుల ఆవేదన ప్రకారం, ఒకసారి ట్యాంకర్ నీరు అందుకున్న తర్వాత మళ్లీ రావడానికి సుమారు 15 రోజుల సమయం పడుతోంది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద ఒక్క డ్రమ్ నీటిని రూ. 50 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.కూలి పనులు చేసి జీవనం…
