
ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు కి ధైర్యం చెప్పిన పిన్నెల్లి సోదరులు, న్యాయపరమైన పోరాటంలో పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, సత్యం మరియు న్యాయం చివరికి విజయం సాధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి వేధించడం సరికాదని విమర్శించారు.
