
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలిస్తుండగా ఆదిలక్ష్మమ్మ (60), మారుతి (18) మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన పాలంకయ్యను నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
