
వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఇటీవల గొంతుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డా. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు గారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కూడా తెలుసుకున్నారు.
