
తనిఖీ సందర్భంగా బంకు నిర్వాహకులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే వాహనదారులకు ఇంధనాన్ని సరఫరా చేయాలని, అంతకు మించి డిమాండ్ చేసినా ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు ప్రజలు ముందుగానే డబ్బాల్లో ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు.
జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత ఉండబోదని ఆర్డీవో హామీ ఇచ్చారు. పెట్రోల్ కొరత ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లలో పెట్రోల్ విక్రయిస్తే బంకు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
