
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని మాచర్ల ఈఈ సింగయ్య కోరారు. గురువారం నారాయణపురం కార్యాలయంలో సిబ్బందితో విద్యుత్ బిల్లుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు తమ ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రతి నెలా బకాయిలు లేకుండా చెల్లించాలని సూచించారు. అలాగే అధికారులు, ఉద్యోగులు నెలవారీ వసూళ్లతో పాటు పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నూరు శాతం వసూళ్ల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, డీఈఈ వీరేశ్వరరావు, ఏఈలు భగవాన్, దండా నాగేశ్వరరావు, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
