
దాచేపల్లి:
దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ బుధవారం బకాయిలపై నోటీసులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులు సూచించారు.
వివరాల ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి:
గవర్నమెంట్ హాస్పిటల్ – ₹3,36,600
ఎమ్మార్వో కార్యాలయం – ₹6,48,323
ప్రభుత్వ పాఠశాలలు – ₹9,28,322
ఎంఢీఓ & ఈపీఆర్‌డీ కార్యాలయాలు – ₹8,15,220
పోలీస్ స్టేషన్ – ₹1,36,313
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ, మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు బి. భగవాన్, డి. నాగేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
