
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గణపవరం చవిటిపాలెం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక (8వ తరగతి విద్యార్థిని)తో చనువుగా ఉంటూ, అదే ప్రాంతానికి చెందిన షాహిద్ (17) అనే మైనర్ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాలిక తల్లి మాధవి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
