
అంతర్జాతీయ యుద్ధ ప్రచారాలతో ఆందోళన – క్యాన్లు, డ్రమ్ములతో ఇంధనం నిల్వకు ప్రజల పరుగులు
న్యూస్ స్టోరీ:
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
దీనితో వాహనాల్లో మాత్రమే కాకుండా, బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్ నింపుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు. బంకుల వద్ద వాహనాల క్యూలు పొడవుగా సాగుతూ రద్దీ తీవ్రంగా మారింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ అందకపోతే సేవలు నిలిచిపోతాయని భయపడుతున్న వారు, ఆటోల్లోనే కాకుండా పెద్ద డ్రమ్ముల్లో కూడా డీజిల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిస్థితి మరింత కొనసాగితే సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
