
వినుకొండ వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసిపి పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై తీవ్ర విమర్శలు చేశారు.
బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలు:
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని విమర్శించారు.
వైసిపి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రతి రైతును అడిగితే తెలుస్తుందని పేర్కొన్నారు.
మొక్కజొన్న పంటకు ప్రకటించిన మద్దతు ధర అమలు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
రైతు భరోసా కేంద్రాలను మూసివేశారని ఆరోపించారు.
‘P4’ పేరుతో పేద ప్రజలతో పాటు ముఖ్యమంత్రిని కూడా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మోసం చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయల సబ్సిడీ హామీ అమలు కాలేదన్నారు.
పేదలకు మూడు సెంట్ల భూమి హామీ నెరవేర్చలేదని అన్నారు.
కూటమి నాయకులు సీఎం, డిప్యూటీ సీఎం జగన్ పేరును ప్రస్తావిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్న హామీ కూడా అమలు కాలేదన్నారు; డబ్బులు ఇస్తేనే గ్యాస్ అందుతోందని చెప్పారు.
వినుకొండ నియోజకవర్గంలో భూకబ్జాలు, అక్రమ వెంచర్లు పెరిగాయని ఆరోపించారు.
👉 ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బొల్లా బ్రహ్మనాయుడు సూచించారు
