
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు.
మంగళవారం శావల్యాపురం మండలం కొత్తలూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించని వైసీపీ నేతలు ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహంపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అమరజీవి త్యాగాలను గుర్తించలేని వారు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.
పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష, త్యాగాల వల్లే ఈనాడు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.
