
ఒక చిన్న అబ్బాయి సైకిల్ తొక్కుతూ వెళ్తూ, రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఒక బైక్‌ను పొరపాటున బలంగా ఢీకొట్టాడు. దాంతో బైక్ నంబర్ ప్లేట్ విరిగిపోయింది.
భయపడినా… అక్కడి నుంచి పారిపోలేదు. యజమాని ఎప్పుడు వస్తాడా అని అదే చోట వేచి చూశాడు.
యజమాని రాగానే జరిగినదంతా నిజాయితీగా చెప్పి,
“నావల్లే విరిగింది… నా దగ్గర ఉన్నవి ఇవే, కొత్తది పెట్టించుకోండి… సారీ” అంటూ తన చిల్లర డబ్బులు ఇవ్వబోయాడు.
ఆ చిన్నారి నిజాయితీ చూసి యజమాని మనసు కరిగిపోయింది. డబ్బులు తీసుకోకుండా, ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడాడు.
ఆ వయసులోనే నిజాయితీ… అతను ఇంట్లో నేర్చుకున్న విలువల ప్రతిబింబం.
పారిపోవడం సులువు…
కానీ నిజం చెప్పడం, తప్పు ఒప్పుకోవడం, అక్కడే నిలబడటం — అదే నిజమైన ధైర్యం.
