





పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని దీపావళి మందుల (ఫైర్‌వర్క్స్) దుకాణాలపై అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలను మాచర్ల తహసీల్దార్, అర్బన్ సీఐ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి చేపట్టారు. తనిఖీలలో భాగంగా దుకాణదారుల వద్ద లైసెన్స్‌లు, వాటి వాలిడిటీ, స్టాక్ వివరాలు, సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని దుకాణదారులకు అధికారులు ఆదేశించారు.
