


పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త బుసా రామాంజనేయులు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి హరి పులి హాజరయ్యారు. వారు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మదీన్ లాల్, కృష్ణ గౌడ్, వినోద్, సాంబశివరావు, కృష్ణ బాబు, ఫారక్, నరసింహా, అమరయ్య, సాయి, రాజేషు, వెంకటరమణ, అబ్బాసు తదితర జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
