
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని మాచర్ల రోడ్డులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద కుటుంబానికి బియ్యం పంపిణీ చేశారు.
జనసేన పార్టీ నాయకుడు పాలపోగు బాబు ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి కడియం అనిల్ అనే పేద కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పాలపోగు బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేదలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి జనసైనికుడు ముందుకు వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
జనసేన పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి జనసేన ముందుంటుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పగిడి కోటయ్య, మేకల రాజేష్ తో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
