
మాచర్ల నియోజకవర్గంలోని సిరిగిరిపాడు గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రైతుల తరఫున వశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ, మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, రూరల్ అధ్యక్షుడు సన్నాయిల బ్రహ్మం, వడ్లమూడి వెంకయ్య, ఏటుకూరి స్వామి, అమృత లింగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, గోపవరపు నీరజ్ తదితరులు పాల్గొన్నారు
