పల్నాడు జిల్లా
నరసరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
10 మంది అరెస్ట్ – రూ.23,300 నగదు స్వాధీనం
పట్టణంలోని శ్రీరాంపురం ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ.23,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ తెలిపారు.
జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఫిరోజ్ హెచ్చరించారు. 🚨
