
దుర్గి: మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం దుర్గి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సీతారాం తెలిపారు.
మండలంలోని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, దుర్గి పట్టణంలో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.
రెండవ శనివారం సందర్భంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మరియు 11 కేవీ లైన్లలో మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచర్ల డీఈ రామయ్య ఆదేశాల మేరకు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు
