
మాచర్ల: 2025–26 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మాచర్ల పురపాలక సంఘం ఇంటి పన్నులు, నీటి చార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టణ ప్రజల సౌకర్యార్థం మార్చి 14 (రెండవ శనివారం), మార్చి 15 (ఆదివారం) రోజుల్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.
అదేవిధంగా మార్చి 31 వరకు అన్ని సెలవు రోజుల్లో కూడా పన్నుల చెల్లింపులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్ పన్నులు చెల్లించాలని కోరారు.
