
గురజాల విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయం తనిఖీ
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన కార్యాలయ పనితీరును పరిశీలించి విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఆరు నెలలుగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు, ప్రస్తుతం ఉన్న బకాయిలు, వ్యవసాయ కనెక్షన్లు మరియు MATS కేసులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా లభించే సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఏఓ చంద్రశేఖరరావు, ఇన్‌చార్జ్ జేఏవో కొండలు, డీఈఈ ఆనందబాబు, ఏఈలు విజ్ఞాన్ ప్రసాద్, మస్తాన్ వలి, ఆపరేషన్ మరియు ఈఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు. ⚡
