
మాచర్ల ఘటనపై డీఎస్పీ మీడియా సమావేశం
పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎం. వెంకటరమణ మీడియాతో మాట్లాడారు.
మాచర్ల పట్టణానికి చెందిన కామన బోయిన చౌడమ్మ అనే యువతి జమ్మలమడక గ్రామానికి చెందిన గంగెన బోయిన నాగరాజు అనే యువకుడితో వెళ్లిపోయినట్లు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టినట్లు చెప్పారు. అయితే యువతి తల్లిదండ్రులు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు చేసిన ఆత్మహత్యాయత్నం వంటి చర్య సరైంది కాదని డీఎస్పీ పేర్కొన్నారు.
యువతి మరియు యువకుడిని గుర్తించేందుకు ఇప్పటికే ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక టీమ్‌లను పంపించి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు
