
పల్నాడు జిల్లా – మాచర్లలో ఉద్రిక్తత
మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కామన బోయిన చంద్రశీను మరియు అతని భార్య గంగ పోలీస్ స్టేషన్ ఎదుటే తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
వారం రోజుల క్రితం తమ కుమార్తె ఒక యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ నిరాశతో ఈ చర్యకు పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
