
మాచర్ల మండలంలోని నాగులవరం గ్రామ పంచాయతీలో హౌస్ టాక్స్ వసూళ్లపై అధికారులు పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), డిప్యూటీ ఎంపీడీవో పాల్గొని పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించారు.
పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సచివాలయం సిబ్బంది హౌస్ టాక్స్ కలెక్షన్‌కు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు. గ్రామంలో పన్ను వసూళ్లను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని అధికారులు సిబ్బందికి సూచించారు
