



పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లింది.
అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసి అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
