
పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా గురజాల ఆర్డీవో మురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 18వ తేదీతో ముగియనుండటంతో, పాలనలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నూతన పాలకవర్గం ఏర్పడే వరకు మాచర్ల పురపాలక సంఘ పరిపాలన ప్రత్యేక అధికారిగా నియమితులైన గురజాల ఆర్డీవో మురళీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలనలో అన్ని పనులు యథావిధిగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
