

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు సమీపంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్‌కు చెందిన ఏటగిరి అదరత్తమ్మ (36)గా గుర్తించారు.
స్థానిక సమాచారం ప్రకారం, మృతురాలు రెండు రోజుల క్రితం ఇస్సపాలెం గ్రామంలో జరిగిన తిరునాళ్ల వేడుకలకు వచ్చినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే నరసరావుపేట గ్రామీణ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.
ఈ ఘటనపై అనుమానితుడిగా ములకలూరు ప్రాంతానికి చెందిన బూదూరు వెంకయ్య (20) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
