

పల్నాడు జిల్లా నకరికల్లు అడ్డరోడ్ సమీపంలో అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కంటైనర్ లారీ ముందుగా మినీ లారీని, తరువాత స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ మరియు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కంటైనర్ లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు మరియు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
