





పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 21వ వార్షికోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల ఉల్లాసం, ఉత్సాహం, కెరింతల మధ్య వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కోమటినేని నాసరయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ జానపద గాయకుడు డాక్టర్ కళాశ్రీ భిక్షు నాయక్, ప్రముఖ టీవీ యాంకర్ మరియు సింగర్ కే.బీ.ఎన్. సుజ శ్రీ, ప్లేబ్యాక్ సింగర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేందర్ రాథోడ్, రేలా ఓ రేలా సింగర్ ఉష అక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యే జీవితంలో విజయానికి దారి తీస్తుందని అన్నారు.
అతిథుల పాటలు, మిమిక్రీ ప్రదర్శనలు, అలాగే విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్లాస్ టాపర్లకు అతిథులు, ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
