



పల్నాడు జిల్లా వినుకొండలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను రాష్ట్ర చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు.
భక్తుల సౌకర్యార్థం మరియు పర్యాటకాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రహదారి పనుల పురోగతిని ఆయన పరిశీలించి, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఏళ్ల తరబడి భక్తులు ఎదురుచూస్తున్న గిరి ప్రదక్షిణ మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా, నాణ్యతతో కూడిన రహదారి నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
