
రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయంతి తెలిపారు.
మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేయబడుతుందని, ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాల జాబితాను పదవ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు కూడా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
