
మాచర్ల: గిరిజన రైతులకు అండగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిలుస్తున్నారు. ఆదివారం మాచర్లలోని వివిఎన్ గార్డెన్‌లో భారతీయ వరి పరిశోధన సంస్థ (IIRR) రాజేంద్రనగర్, పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గిరిజన రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు.
షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక పథకం కింద నియోజకవర్గంలోని సుమారు 800 మంది ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై బ్యాటరీ స్ప్రేయర్లు, టార్ఫాలిన్ పట్టలు అందజేయనున్నారు.
ఎస్టీ రైతులకు ఈ పరికరాలను ఉచితంగా అందజేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి మేరకు వరి పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
మీకు కావాలంటే MY News వెబ్‌సైట్ కోసం ఆకర్షణీయమైన
