
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
హార్ముజ్ జలసంధి నుంచి ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడే అవకాశం ఉంది.
పెరిగిన ధరల ప్రకారం
ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది.
ముంబైలో ధర రూ.852.50గా ఉంది.
కోల్‌కతాలో రూ.879 నుంచి రూ.930కు పెరిగింది.
చెన్నైలో రూ.868.50 నుంచి రూ.928.50కు చేరింది.
ఇక వాణిజ్య సిలిండర్ ధరలు కూడా పెరిగాయి.
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1768.50 నుంచి రూ.1883కు పెరిగింది.
ముంబైలో రూ.1720.50 నుంచి రూ.1835కు పెరిగింది.
కోల్‌కతాలో రూ.1875.50 నుంచి రూ.1990కు పెరిగింది.
చెన్నైలో రూ.1929 నుంచి రూ.2043.50కు చేరింది.
గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోయినా, ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరగడంతో ఈ పెంపు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
