
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకుడు పిడుగు వీరారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి గ్రామం వదిలి వెళ్లాలని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో భయంతో గత రెండేళ్లుగా కుటుంబంతో కలిసి నడికుడి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
శుక్రవారం సొంత గ్రామమైన రామాపురానికి వచ్చిన వీరారెడ్డిని పలకరిస్తామని పిలిచి, ఇంటి సమీపంలో మాటువేసి ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో గాయపడిన వీరారెడ్డిని చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని పల్నాడు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
