
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన మండెపూడి నరసింహారావు జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.
బుధవారం రోజూ మాదిరిగానే బేతపూడి గ్రామ పరిసరాల్లో గొర్రెలను మేపుతున్న సమయంలో సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది.
ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో కాపరి నరసింహారావు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
👉 అధికారుల నుంచి పరిహారం అందించాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.
