
సత్తెనపల్లి:
అకాల వర్షాలు సత్తెనపల్లి ప్రాంతంలో మిర్చి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. కల్లాల్లో అరబెట్టిన మిర్చి పంట వర్షానికి తడిసి ముద్దయింది.

మిర్చి తడవకుండా ఉండేందుకు రైతులు ప్లాస్టిక్ పరదాలు కప్పుతూ పరితపిస్తున్నారు. మరోవైపు కల్లాల్లో నిలిచిన వర్షపు నీటిని చేతులతోనే చిమ్ముతూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హఠాత్తుగా కురిసిన వర్షాల వల్ల మిర్చి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
