
పిడుగుపాటుతో కొబ్బరి చెట్టుకు మంటలు – తృటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం:
తాడేపల్లి మండలం గుండుమేడ గ్రామంలో పిడుగుపాటు కలకలం రేపింది. పిడుగు పడటంతో ఒక కొబ్బరి చెట్టుకు నిప్పు అంటుకుంది.
అయితే సమీపంలో ప్రజలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నివారించబడింది.
