
బాపట్ల జిల్లా, వేమూరు:
భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామ పొలాల్లో విషాదం చోటుచేసుకుంది. మినుము పీకుతున్న సమయంలో ఆకస్మికంగా పిడుగుపడటంతో మహిళా రైతు కూలీ అక్కడికక్కడే తీవ్రంగా గాయపడింది.
మృతురాలిని పెరవలి వనజ (35)గా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న వనజను వెంటనే ధూళిపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
