

మాచర్ల డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో గౌరవ సూపరింటెండింగ్ ఇంజనీర్ పల్నాడు డా. పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సింగయ్య పాల్గొన్నారు.
సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ రెవెన్యూ కలెక్షన్లు మరియు ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది వినియోగదారులతో మమేకమై, వారికి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు హాజరయ్యారు.
