




మాచర్ల పట్టణంలోని 9వ వార్డులో పీపుల్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బోర్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలపై నాయకులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు కూడా హాజరై, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
స్థానిక ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.
