


మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం నేటితో ముగియనుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి శ్రీమతి పిన్నెల్లి రమా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా సామాన్య ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పరంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గత 20 నెలలుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా పార్టీని నమ్ముకుని నిలిచిన ప్రతి మున్సిపల్ కౌన్సిలర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి, పిన్నెల్లి సోదరులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
