







దుర్గి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పాఠశాల పరిసరాలు, వంటగది, మధ్యాహ్న భోజనానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించిన ఆయన, విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల డ్యూటీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉపాధ్యాయులను ప్రశ్నించడంతో పాటు, ఉన్నతాధికారులకు నేరుగా ఫోన్ చేసి పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుల విధుల గురించి వివరించారు.
అలాగే స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టి, పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
తదుపరి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.
“మళ్లీ పాఠశాలకు వస్తాను.. ఆ సమయానికి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలి” అని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు.
