

మాచర్ల అభివృద్ధి ప్రదాత జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 10వ వార్డు మరియు 8వ వార్డుల్లో గల మసీదుల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇమామ్లు, మౌజాన్లకు కొత్త బట్టలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మద్దిగపు బుల్లి రెడ్డి, భాగం హనుమంతరావు (86వ బూత్ ఇంచార్జ్), దాసు (98వ బూత్ ఇంచార్జ్), డేరంగుల డేవిడ్ రాజ్ (96వ బూత్ ఇంచార్జ్) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని 10వ వార్డు, 63వ బూత్ ఇంచార్జ్ షేక్ జానీ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు.
